Home Page SliderTelangana

కానిస్టేబుళ్ల భార్యల నిరసన.. సచివాలయం ముట్టడి

సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ భర్తలను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని నిరసిస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు సచివాలయాన్ని ముట్టడించారు. అనంతరం తమ భర్తలు ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోండి. ఒక్క దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు. ప్రభుత్వం ఇలా మొండిగా వెళ్లడంతో ఇబ్బందులు పడుతున్నం. ఇక్కడ, అక్కడ కొన్ని రోజుల డ్యూటీ వల్ల పెళ్లి కూడా చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ ముందు ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.