వంటకు కానిస్టేబుల్స్ కావాలి
తెలంగాణ కానిస్టేబుల్స్ వంట చేయడానికి కావాలంటూ వాట్సాప్ మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ఏడీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఇంట్లో వంట చేయడానికి కానిస్టేబుల్స్ కావాలి, వెజ్ ఫుడ్ వండాలంటూ ఈ మెసేజ్ సారాంశం. అయితే ఈ వాట్సాప్ మెసేజ్‌పై నెటిజన్లు చర్చిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్లపై ఇలాంటి పరిస్థితులపై ధర్నా చేయడం సరైనదేనని కామెంట్లు చేస్తున్నారు. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు.