అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నారు
సీఎం రేవంత్ రెడ్డికి తప్పనిసరిగా గుణపాఠం చెప్పి తీరుతామని బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫార్ములా-ఈ కేసులో వ్యవహారంలో న్యాయనిపుణులతో సంప్రతింపులు జరుపుతున్నామన్నారు.వారి సూచన మేరకు విచారణకు హాజరౌతానని స్పష్టం చేశారు.తనపై ఏసిబి,ఈడి నమోదు చేసిన కేసులన్నీ నీరుగారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను,తన సోదరి కవిత ఇద్దరం సీఎం అభ్యర్ధిత్వాల కోసం తన్నుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా దుష్ప్రచారం చేస్తున్నారని కేటిఆర్ మండిపడ్డారు.తమ పార్టీ సీఎం అభ్యర్ధి ఎప్పటికీ కేసిఆరేనని చెప్పారు.దేశంలో ఇంతటి దిక్కుమాలిన సీఎం ఏ రాష్ట్రంలోనూ లేడని ధ్వజమెత్తారు.పరిపాలన చేయమని పెత్తనమిస్తే పన్నులతో ప్రజలను బోడిగుండు చేస్తున్నాడని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు,అరెస్టులకు బీ.ఆర్.ఎస్ ఎప్పుడూ భయపడబోదని అన్నీ న్యాయ స్థానంలో తేల్చుకుంటామన్నారు.

