Home Page SliderTelangana

ఎంఐఎంతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం-కిషన్‌రెడ్డి

తెలంగాణ: కాంగ్రెస్‌కు బొటాబొటీగా మెజార్టీ ఉందని.. తుమ్మినా, దగ్గినా ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో ఎంఐఎంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు. మజ్లిస్‌కు బాధ్యతలు ఇవ్వడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. రెగ్యులర్ స్పీకర్ వచ్చాక బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.