News

మరోస్థానంలో గెలిచిన కాంగ్రెస్

ఈ రోజు ఉదయం ప్రారంభమైన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది.కాగా మొదట విడుదలైన ఫలితంలో కౌంటింగ్‌లో  ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది.ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ గెలిచారు. ఈయన బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 23,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇప్పుడు విడుదలైన రెండో ఫలితంలో కూడా కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గెలిచారు. ఈయన బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియపై విజయం సాధించారు.దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు షురూ చేశాయి.