Home Page SliderTelangana

ఒకే ఒక్కశాతం ఓట్లతో హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా వెనుకబడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని పొందిన కమలం పార్టీ ఈసారి ఎన్నికల్లో దెబ్బతింది. 68 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 39 స్థానాలు వచ్చేలా ఉండగా, బీజేపీ 26 స్థానాల వద్దే ఉండేలా ఫలితం కన్పిస్తోంది. స్వతంత్రులు మరో మూడు చోట్ల విజయం సాధించేలా ఉన్నారు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మెరుగ్గా రాణించినా గెలుపు వాకిట బోల్తా పడింది. కేవలం ఒక్కటంటే ఒక్క శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 13 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ ఓటమి పాలయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం ఓట్లు లభించగా, బీజేపీకి 42.9 శాతం ఓట్లు లభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒక్క శాతం ఓట్లను పొందగా, ఇతరులు 12 శాతం ఓట్లను పొందారు. ఎమ్మెల్యేలను చేజారిపోతారన్న భయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ… వారందరినీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ లేదంటే రాజస్థాన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు
హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఓటమిని అంగీకరించారు.