బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్ మోస్తుంది:మంత్రి శ్రీధర్
తెలంగాణా ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.కాగా గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు తాము మోస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.గ్రామాల్లో సొంత డబ్బుతో పనులు చేయించిన సర్పంచులు సంబంధిత బిల్లులకు మోక్షం రాక ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పెండింగ్ బిల్లుల చెల్లింపుల్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామీణ,పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.