జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు అడ్డుకోలేరు: మంత్రి శ్రీధర్ బాబు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
అసలు BRS పార్టీ ఓటు చోరీతోనే గెలిచిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
BRS నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, గతంలో జరిగిన MLC ఎన్నికల్లో ఓట్ల చోరీ చేసి గెలిచిందని ఆరోపించారు.
అర్హత లేని విద్యార్థులను ఓటర్ల జాబితాలో చేర్చారని మండిపడ్డారు.
అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలపై శ్రీధర్ బాబు స్పష్టత ఇచ్చారు. “మా మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు” అని తెలిపారు.