‘కర్ణాటక నోట్లతో కాంగ్రెస్ బండారం బయటపడింది’…బీఆర్‌ఎస్ నేత
కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన అంబికా పతి ఇంట్లో రూ.40 కోట్ల రూపాయలు పట్టుబడడంతో కాంగ్రెస్ బండారం బయటపడిందని బీఆర్‌ఎస్ నేత మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. రూ. 1500 కోట్ల రూపాయలు కర్ణాటక కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేశారని, ఆ సొమ్ము తెలంగాణకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బెంగళూరులో బయటపడిన నోట్ల కట్టలు కాంగ్రెస్ నేతలవే అన్నారు. డబ్బుతో ఓట్లు కొని కాంగ్రెస్ గెలవాలని చూస్తోందని, అసలు ఆ పార్టీకి సంస్థాగత బలం లేదని, అభ్యర్థులే దొరకడం లేదని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచేది కల్ల అని, ప్రజల నమ్మకం ఎల్లప్పుడూ బీఆర్‌ఎస్ మీదే ఉందని వ్యాఖ్యానించారు.