Home Page SliderNational

ఎమ్మెల్యేలు జారిపోకుండా కాపాడుకునేపనిలో కాంగ్రెస్

కర్నాటకలో విజయానికి చేరువవుతామని భావిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ బలవం 110-115 మధ్య ఆగిపోతుందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జారిపోయే ప్రమాదం ఉందని కూడా అనుమానిస్తోంది. ఎమ్మెల్యేలను తమిళనాడుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోందని, అధికార డీఎంకే నాయకత్వంతో టచ్‌లో ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సాయంత్రంలోగా బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుతో నాయకుడికి క్రెడిట్ ఇచ్చేలా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వీడియోను పోస్ట్ చేసింది.
“నేను అజేయంగా ఉన్నాను. నేను చాలా నమ్మకంగా ఉన్నాను. అవును, నన్ను ఈ రోజు ఆపలేరు” అని కాంగ్రెస్ ఫైర్ ఎమోజీతో వీడియోను ఉంచింది.

రాహుల్ గాంధీ యాత్ర ప్రజలను “శక్తివంతం” చేసి అధికారంలో ఉన్న బీజేపీని దెబ్బతీసిందని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ పై పైచేయి సాధించడంతో కాంగ్రెస్‌లో సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ గెలిస్తే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సీఎం పీఠం కోసం హోరాహోరీ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. కర్నాటక ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. ‘బీజేపీని అధికారం నుంచి తప్పించేందుకు ఏమైనా చేస్తాం.. కర్నాటక ప్రయోజనాల దృష్ట్యా మా నాన్న ముఖ్యమంత్రి కావాలి’ అని యతీంద్ర సిద్ధరామయ్య వార్తా ఏఎన్‌ఐతో అన్నారు.

కర్నాటకలో ఏ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. 38 ఏళ్లుగా సాగుతున్న పరంపరకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నించింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు రోడ్‌షోలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. 1985 తర్వాత ఐదేళ్లు పూర్తి పదవీకాలంలో ఏ ప్రభుత్వం కర్నాటకలో కొనసాగలేదు.