13 మందిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 13 మంది నేతలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన ఆభ్యర్థులపై పోటీగా ఇండిపెండెంట్లుగా పోటీకి దిగడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. బహిష్కరించిన వారిలో గతేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ లోకి వచ్చిన పండ్రి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ అభ్యర్థి సజ్జన్ సింగ్ ధూల్ కూడా ఉన్నారు. సస్పెండ్ చేసిన నేతల్లో గుప్త అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నరేశ్ ధండే, ప్రదీప్ గిల్ (జింద్), సజ్జన్ సింగ్ ధుల్ (పండ్రి), సునీతా బట్టన్(పండ్రి), రాజీవ్ మమురం గోండార్ (నీలోఖేరి), దయాల్ సింగ్ సిరోహి (నీలోభేరి), విజయ్ జైన్ (పానిపట్ రూరల్), దిల్బేగ్ శాండిల్(ఉచన కలాస్), అజిత్ ఫోగట్ (దాద్రీ), అభిజీత్ సింగ్ (భవానీ), సత్బీర్ రాటేరా(బవానీ ఖేరా), నీతు మన్ (ప్రధా), అనితా ధుల్ (కలయత్) ఉన్నారు.

