తీవ్రవాదం, ఉగ్రవాదం పట్ల కాంగ్రెస్‌ది మెతక వైఖరి: యోగి
ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని.. ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పంచి పెట్టారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని గుర్తు చేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయని, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దుచేశామని పేర్కొన్నారు.