అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు
తెలంగాణ: అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తుక్కుగూడ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు. దీంతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అయితే బీజేపీ సైతం కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ స్థానాలు వస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.


 
							 
							