65 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ
తొలి రౌండ్ పూర్తయ్యేసరికి ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందుతున్న 109 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్ 39 చోట్ల ముందంజలో ఉంది. ఇక బీజేపీ 6 చోట్ల, మజ్లిస్ నాలుగు చోట్ల, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్‌లో.. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2380 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి 1500 లీడ్ లో కొనసాగుతున్నారు. తుంగతుర్తి లో 3600 ఓట్ల ఆధిక్యం లో కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామెల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ లో.. కాంగ్రెస్ అభ్యర్ధి BLR 1500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తి 4000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందున్నారు. నల్లగొండ లో రెండూ రౌండ్స్ పూర్తి అయ్యే సరికి 5407 ఓట్ల అధిక్య లో కాంగ్రెస్ ముందుంది.

