కాంగ్రెస్ పార్టీ పనైపోయింది.. 2024లో వచ్చేది బీజేపీయే-మోదీ
ప్రతిపక్షాలు సామాజిక న్యాయం గురించి మాత్రమే మాట్లాడతాయి, అయితే ప్రతి భారతీయుడికి సహాయం చేయడం కోసం శ్రమించేది బీజేపీ అని, పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మోదీ అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సందేశమన్నట్టుగా ఆయన మాట్లాడారు. “ప్రతిపక్షం చాలా నిరాశగా ఉంది, కానీ 2024లో బిజెపిని ఎవరూ ఓడించలేరు” అని మోదీ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. “మోడీ తేరీ కబ్ర్ ఖుదేగీ” (మోదీ, మీ సమాధి తవ్వబడుతుంది) నినాదాలను మరోసారి గుర్తుచేశారు.

దేశంలో అవినీతి, బంధుప్రీతి, శాంతిభద్రతలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని, భక్తి, బలం, ధైర్యసాహసాలకు పూజించే హిందూ దేవుడైన హనుమంతుడి నుంచి స్ఫూర్తి పొందుతున్నామన్నారు మోదీ. ” హనుమంతుడిలా… ఈ రోజు భారతదేశం సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంది. మా పార్టీ హనుమాన్‌జీ నుండి స్ఫూర్తిని తీసుకుంటుంది. హనుమంతుడు మేము కూడా కరుణ, వినయపూర్వకంగా ఉంటాం” అని ప్రధాని మోదీ అన్నారు.

బీజేపీకి హనుమంతుడిలా సంకల్పం, చేయగలిగే దృక్పథం ఉందని, పెద్ద కలలు కనడం, వాటిని నెరవేర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడమే ఆ పార్టీ రాజకీయ సంస్కృతి అని, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చిన్న ఆలోచనా ధోరణితో వ్యవహరిస్తాయని అన్నారు. అవినీతి, కులతత్వం, కుటుంబ పాలనలో ఆ పార్టీలు కూరుకుపోయాయన్నారు. 2014లో తొలిసారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 800 ఏళ్ల బానిసత్వానికి స్వస్తి పలికి భారత రాజకీయాల్లో ఆదర్శప్రాయమైన మార్పు తీసుకొచ్చిందని అన్నారు. బీజేపీ ఎప్పుడూ దేశాన్ని తన విధానంగా ముందు ఉంచుతోందని, సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. ‘సబ్కా హాత్, సబ్కా సాథ్, సబ్కా ప్రయాస్’ని బీజేపీ విశ్వసిస్తుందని, అంటే అందరి చేయి, అందరి మద్దతు, అందరి కృషి అని ఆయన అన్నారు.

ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 14 వరకు వారం రోజుల పాటు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలను, నేతలను మోదీ కోరారు. దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రదేశాల్లో ఇవాళ ప్రధాని ప్రసంగాన్ని ప్రదర్శించారు. బీజేపీ నాయకులు, కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు మోదీ ప్రసంగాన్ని వినడానికి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

