బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ఎంపీ సవాల్
బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు.కాగా తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యను అని తెలిపారు. అయితే కేటీఆర్,హరీష్‌రావుకు ఈసారి ఓటమి భయం పట్టుకుంది. ఈ నెల14 లేదా 15న కాంగ్రెస్ CEC సమావేశం జరుగుతుంది. కాగా ఇప్పటికే 90శాతం కాంగ్రెస్ టికెట్లు ఖరారు అయ్యాయన్నారు.అయితే దసరా లోపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణాలో కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని కాంగ్రెస్ గెలుపుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీజేపీకి 2 సీట్లు కూడా రావు అన్నారు.