Home Page SliderTelangana

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులు అంత సీరియస్ విషయమేం కాదన్నారు. ప్రస్తుత రాజకీయాలలో ఫిరాయింపులు సాధారణమే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో చేరే నేతలందరూ గతంలో కాంగ్రెస్ పార్టీవారే అన్నారు. గతంలో కాంగ్రెస్ వీడి బీఆర్‌ఎస్‌లో చేరినవారే తిరిగి మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు కూడా నేతలు పార్టీలు మారడాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఈయన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ వారు మండిపడుతున్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే ఓట్లేసిన ప్రజలను మోసం చేసినట్లేనని విమర్శిస్తున్నారు.