రైల్వే ప్రమాదాలపై ట్రోల్ ఆర్మీతో కాంగ్రెస్ కుట్ర చేస్తోంది-రైల్వేమంత్రి ఫైర్
రైల్వే ప్రమాదాలపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ రైల్వే మంత్రి ఫైరయ్యారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ ఆర్మీతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది, కుట్రలు చేస్తోందంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో రైల్వే ప్రమాదాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనికి ఆయన జవాబిస్తూ ఇక్కడ అరుస్తున్నవారు 58 ఏళ్లు భారత్‌లో అధికారంలో ఉన్నారు. వారు అన్నేళ్లు ఉండి కూడా 1 కిలోమీటర్ కూడా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదు. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ప్రమాదాలు తగ్గాయని చెప్తే అప్పట్లో అందరూ చప్పట్లు కొట్టారు అంటూ మండిపడ్డారు.