‘కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే’…కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటనే ఎంచుకుందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. శంషాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. ఆయన మాట్లాడుతూ గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన 2014 నుండి పదేళ్ల పాటు ఉన్న ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపలేకపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఒక్కసీటు కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల నమ్మకాలన్ని నిలబెట్టలేకపోయిందన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజలలో విశ్వాసం కోల్పోయిన పార్టీగా నిలిచిందన్నారు. తెలంగాణలో బీజేపీ ఓటుశాతం 14 శాతం నుండి 35 శాతానికి పెరిగిందని, ఇది సాధారణ విషయం కాదని హర్షం వ్యక్తం చేశారు.

