కాంగ్రెస్ అంటే మహిళలను ప్రోత్సహించే పార్టీ:సీతక్క
తెలంగాణా మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో ఎస్టీలకు ఉద్యోగాలు రాలేదన్నారు.కేసీఆర్ కిట్‌లపై జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామన్నారు.కాగా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలను ప్రోత్సహించే పార్టీ అని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని సీతక్క తెలిపారు.వచ్చే నెల 5 నుంచి గ్రామాల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉంటుందన్నారు.

