Home Page SliderTelangana

మెగా కుంభకోణంపై కాంగ్రెస్ భారీ ర్యాలీ

అదానీ మెగా కుంభకోణంపై విచారణకు డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణకు జేపీసీ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ హాజరయ్యారు.