Home Page SliderTelangana

రాష్ట్రాన్ని గోస పెట్టిందే కాంగ్రెస్: CM-కేసీఆర్

వరంగల్: మే గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సగం కాలిన కడుపులు, ఎమర్జెన్సీ.. కర్ఫ్యూలు.. ఎన్‌కౌంటర్లు.. రక్తపాతాలు.. కరెంట్ కోతల వంటి వెతలతో నిత్యం ప్రజలు కన్నీళ్లు కార్చే ఆ రాజ్యాన్ని మనం మళ్లీ తెచ్చుకోవద్దు. పేదలు లేని తెలంగాణ నా స్వప్నం.. రాష్ట్రాన్ని గోస పెట్టిందే కాంగ్రెస్.. ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వని బీజేపీకి ఓటు వేయవద్దు.. తెలంగాణ సాధించి, ప్రగతి పథాన నిలబెట్టిన బీఆర్ఎస్‌నే గెలిపించండి అని బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 50 ఏళ్లలో ఎంత చేసింది బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎంత చేసిందీ అనేది బేరీజు వేసుకుని ఓటేయమని ఓటర్లను వేడుకుంటున్నా అని కేసీఆర్ మాట్లాడారు.