Home Page SliderTelangana

‘కాంగ్రెస్ బడ్జెట్‌లో తన మేనిఫెస్టోని మరిచిపోయింది’..హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏ మాత్రం పసలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోనే మరిచిపోయిందన్నారు. హామీల ప్రస్తావన లేకుండా అప్పులు తెస్తామని చెప్పడాన్ని విమర్శించారు. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం 8 నెలలుగా అమలు చేయలేదు. ఆసరా పెన్షన్ ఇంతవరకూ ఇవ్వలేదు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4000 పెన్షన్ ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు. మహిళలకు ఫ్రీ బస్సుల పేరిట ఆటో వర్కర్ల పొట్టకొట్టింది. విద్యాబరోసా కార్డు, అమ్మాయిలకు స్కూటీల ప్రస్తావన లేదు. చేనేత కార్మికులు, ఆశావర్కర్లకు ఏ విధమైన సహాయం లేదు. పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పేదల కోసం బడ్జెట్‌లో ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు హరీష్ రావు.