Home Page SliderTelangana

అధిక వడ్డీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అప్పు..బండి సంజయ్

మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అప్పులను చేసే కుట్రలు చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నేడు కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రబడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు గాడిద గుడ్డు లాంటివని ఎద్దేవా చేశారు. వీటిని అమలు చేయలేక కేంద్రంపై ఆరోపణలు చేస్తోందన్నారు. నీతి అయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అధిక వడ్డీలకు తెచ్చిన అప్పుల భారం మళ్లీ ప్రజలపైనే పడుతుందని, దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చలు జరపవలసిందేనన్నారు. గతంలో కేసీఆర్ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్,బీఆర్‌ఎస్ నేతలు అవకాశవాదులు. ఈ రెండు పార్టీలు కలిసే బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కాళేశ్వరంపై ఈ రెండుపార్టీలు డ్రామాలాడుతున్నాయి. అవకాశం వస్తే ఈ రెండు పార్టీలు విలీనం అవడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు.