Home Page SliderTelangana

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా స్వప్నం-సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ మాటిస్తే.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీల వల్ల నా ప్రియమైన సోదరీమణులకు సాధికారత చేకూరుస్తాయన్నారు సోనియా గాంధీ. మహాలక్ష్మి పథకం మహిళలకు నెలకు ₹2,500, LPG సిలిండర్ ₹500 మరియు TSRTCలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇస్తుందని… ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నది నా కల. మా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేస్తుందని భరోసా ఇస్తున్నానన్నారు.