Home Page SliderTelangana

“కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రైతులను వంచించింది”: కేసీఆర్

తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బడ్జెట్‌పై భట్టి ప్రసంగించారు. కాగా డిప్యూటీ సీఎం ప్రసంగంపై తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగం ఓ కథలా,రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు. కాగా ఈ ప్రభుత్వం బడ్జెట్‌తో రైతులను వంచించిందని కేసీఆర్ ఆరోపించారు. అయితే రాష్ట్ర బడ్జెట్‌లో రైతులకు ఒక్క పాలసీ ప్రకటించలేదన్నారు. అంతేకాకుండా ఒక్క ఇండస్ట్రీ గురించి కూడా ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్‌ను చూసిన తర్వాత వీళ్లకు ఒక్కదానిపై కూడా స్పష్టత లేదని తెలిసిందని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా ఈ ప్రభుత్వం మహిళలకు కూడా ఇచ్చిందేమి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా సరిగ్గా లేదని కేసీఆర్ తెలిపారు.ఇక ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని కేసీఆర్ హెచ్చరించారు.