Home Page SliderNational

భారతీయులను అవమానించిన ‘శాం పిట్రోడా’కే కాంగ్రెస్ విదేశీ బాధ్యతలు

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ శాం పిట్రోడాకే బాధ్యతలు అప్పజెప్పడాన్ని తప్పు పట్టారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. రూపురేఖలనుద్దేశిస్తూ భారతీయులను గతంలో పిట్రోడా అవమానపరిచారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ముందే దీనిని ఊహించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్‌తోనే కొందరితో అలా మాట్లాడిస్తుందని, తర్వాత వారిని గుర్తింపు ఉండే పదవులలో తీసుకుంటారని ఎద్దేవా చేశారు. అలాగే గతంలో వివాదాస్పద వాఖ్యలు చేసిన పిట్రోడా రాజీనామా చేశారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత బాధ్యతలు అప్పగిస్తారు చూడండి అని ప్రధాని అప్పుడే చెప్పారు అలాగే జరిగిందన్నారు. ఇదంతా ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు చేసే కుట్రలని మోదీ ఆ వీడియోలో పేర్కొన్నారు. లోక్‌సభ  ఎన్నికల సమయంలో పిట్రోడా భారతీయుల రంగు, పోలికలపై వాఖ్యలు చేశారు. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరి ఉంటారని, ఉత్తరాది వారు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వారు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని, మనది వైవిధ్యమైన దేశమని వివాదాస్పదంగా మాట్లాడారు. దీనిపై బీజేపీ విమర్శలు చేయగా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆయననే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియమించింది.