గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం, పార్టీ పటిష్టత తదితర అంశాలు అజెండాగా ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కే కేశ వరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వీ హనుమంత రావు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.