కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు ముందు సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పమనండి..లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవ్వడం కాదు దమ్ముంటే సీఎం క్యాండిడేట్‌ను అనౌన్స్ చేయమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత లక్ష్మారెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు దొరకని వారు పార్టీలు మారడం సహజమని కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోతో వారి గ్యారంటీలు గాలికి కొట్టుకుపోయాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్‌ఎస్ పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు. వారికి సొంతంగా అజెండాలు లేవని వ్యాఖ్యానించారు.

