రేపు కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం
తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత గవర్నర్ ను ఎమ్మెల్యేలు కలిసి జాబితా సమర్పించనున్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది రేపు తేలనుంది. ఇప్పటికే సీఎం రేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేసులో ముందు వరుసలో ఉన్నారు.

సోనియా పుట్టినరోజైన 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు బహిరంగ సభలలో ప్రకటించారు. తెలంగాణ డీజీపీకి రేపటి నుండి 9 వతేదీ వరకూ కాంగ్రెస్ నేతలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయమని కోరినట్లు సమాచారం. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నా తాము సిద్ధంగా ఉన్నామని, డీజీపీ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.