ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ ఘాటు విమర్శలు
మణిపూర్‌లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ఈ అంశంతో పార్లమెంటు ఉభయసభలు నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత , కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా మణిపూర్ దహనం దేశానికే చీకటి అధ్యాయమని ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య ఆలయమైన పార్లమెంటులో మణిపూర్ హింసపై మాట్లాడకుండా..దేశమంతా ప్రధాని రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.మణిపూర్‌ను చీకట్లోకి నెడుతూ..నియంతృత్వ విధానంతో వ్యవహరిస్తున్న బీజేపీ బాధ్యతను విస్మరించొద్దు.మణిపూర్ ప్రజలకు శాంతి అవసరం అని వీడియోలో పేర్కొన్నారు.

