Home Page SliderTelangana

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎడ్రస్‌ గల్లంతు చేయాలే.. బండి సంజయ్

మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షో విజయవంతమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రసంగం చేశారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నారాయణపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.రతంగ్ పాండురెడ్డి నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన రోడ్ షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్లబొల్లి కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల్ని నమ్మొద్దని ఆయన అన్నారు.