Home Page SliderNational

 స్మృతి ఇరానీపై కాంగ్రెస్ మండిపాటు

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏదో ఒక విషయంపై విమర్శలు సాధారణమయ్యాయి. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటననుద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. యువరాజు విసుగు చెందాడంటూ ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. స్మృతి ఇరానీ నుద్దేశించి మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి, రెజ్లర్ల ఆందోళనల గురించి పెదవి విప్పరని, కానీ రాహుల్ గాంధీని మాటలనడానికి మాత్రం ముందుంటారని కాంగ్రెస్ నేత సుప్రియా ష్రినేట్ మండిపడ్డారు. స్మృతి ఇరానీని బీజేపీ పక్కన పెట్టేసిందని, దీనితో నిరాశకు గురయ్యిందని, వైద్యులను సంప్రదించమని సలహా ఇచ్చారు. మోదీ పర్యటననుద్దేశించి మణిపూర్ అల్లర్లు జరుగుతున్నా, రాజధాని ఢిల్లీ వరదలో కొట్టుకుపోతున్నా ప్రధానికేమీ పట్టదని, మోదీకి విదేశీ పర్యటనలు, అవార్డులు ,రఫేల్ విమానాలు కావాలని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనికి జవాబుగానే స్మృతి ఇలా స్పందించారు. రాహుల్ మేకిన్ ఇండియా ఆశయాలను తొక్కేస్తున్నారని, ప్రధానికి గౌరవం లభించడాన్ని సహించలేకపోతున్నారని విమర్శించారు.