Home Page SliderNewsTelangana

భూ వివాదంపై కాంగ్రెస్, టీడీపీ నాయకుల ఘర్షణ

కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది. కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య భూ వివాదంపై ఘర్షణ చెలరేగింది. రామచంద్రపురం గ్రామంలో రెండు ఎకరాల భూమి తమదేనని టీడీపీ నేత హరి ప్రసాద్ ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు వస్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘర్షణ విషయం తెలుసుకొని పోలీసులు రంగంలో దిగారు. అయితే.. సీఐ గన్ మెన్ పైన దాడికి ప్రయత్నించారు. కారు, జేసీబీ పైన కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.