రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఇంకెన్నాళ్లు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బంధు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయన్న కిషన్‌రెడ్డి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకేతాను ముక్కలు, కుటుంబ పార్టీలను బీజేపీ ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద మా పోరాటం ఆగదు. బీజేపీ గెలిస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం. ఇప్పటికే దేశంలో అనేక నగరాల పేర్లు మారాయి. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు.. పాతబస్తీని అభివృద్ధి చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం అని కిషన్ రెడ్డి తెలిపారు. ఓటర్లందరూ బీజేపీకి సహకరించి, మీ ఓటును కమలం గుర్తుపై వేయవలసిందిగా కిషన్ రెడ్డి కోరారు.