‘కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయి’..కేటీఆర్
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కలిసి నాటకాలు ఆడుతున్నారని, అందుకే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజాసమస్యలకు సమాధానం చెప్పలేక దిక్కుతోచని స్థితిలో ఇలాంటి పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారిందన్నారు. వాళ్లెన్ని చేసినా, చట్టాలు, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదని విమర్శలు కురిపించారు.