ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయమే-కాంగ్రెస్ ఆరోపణ
హైదరాబాద్: ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీచేస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడారు. ఢిల్లీలో ఎంపీల నివాసం నుండి తనను వెళ్లగొట్టినా బాధపడలేదన్నారు. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటకి వచ్చినట్లు చెప్పారు. ఈడీ విచారణ పేరుతో తనను గంటల కొద్దీ కూర్చోబెట్టారన్నారు. బీజేపీ చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే టీమ్.. వారు కలిసే పనిచేస్తారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసూ లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్ ఏర్పడుతుంది. కాబట్టి సుస్థిరమైన పాలన కావాలంటే చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించమని రాహుల్ గాంధీ అడిగారు.