మండలిని చేజిక్కించుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్ నుండి చేరిన ఎనిమిది మందితో కాంగ్రెస్ బలం 12కి చేరింది. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలకు గాను గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 38లో కాంగ్రెస్ బలం 12కి చేరింది. మరికొంతమంది బీఆర్ఎస్ సభ్యుల్ని చేర్చుకొని ఆ పార్టీని దెబ్బతీయాలని యత్నిస్తోంది.