“డిప్యూటీ సీఎంకు కంగ్రాట్స్”:సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తన కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా నియమితులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంత్రివర్గంలో వివిధ శాఖలు పొందిన నా సహచరులందరికీ అభినందనలు. అందరం ఏపీ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని ,ప్రజా పాలనకు నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు కృషి చేస్తారని నమ్మకం నాకుంది. నూతన ప్రయాణంలో మరోసారి అందరికీ శుభాకాంక్షలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.