కంగ్రాట్స్ రాహుల్.. మరోసారి బీజేపీని గెలిపించారు..
దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. కంగ్రాట్స్ రాహుల్ మరోసారి బీజేపీ ని గెలిపించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ముందంజలో ఉంది.

