తెలంగాణా మెడికల్ కాలేజీలపై ఈడీ దాడుల కలకలం
తెలంగాణా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 10 మెడికల్ కాలేజీలలో ఈడీ దాడులు జరుగుతున్నాయి. తెలంగాణా మంత్రి మల్లారెడ్డి కాలేజీతో సహా 10 కాలేజీలలో ఈడీ సోదాలు చేస్తోంది. బొమ్మెకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజి, సంగారెడ్డి లోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక కామినేని,ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలలో ఈరోజు ఉదయం నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు కారణాలు, వివరాలు ఇంకా సమాచారం లభించవలసి ఉంది. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలలోనూ, తర కార్యాలయాలలోనూ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ఈడీ ఆఫీస్ నుండి 11 బృందాలుగా ఏర్పడి ఈడీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. వీరితో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా తీసుకొని వెళ్లినట్లు సమాచారం. కొవిడ్ సమయంలో భారీగా నిధులు మళ్లింపులు, అవకతవకలు జరిగాయని సమాచారం. మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణాలోని మెడికల్ కాలేజీలు 12 వేల కోట్ల రూపాయల స్కామ్‌లో ఉన్నాయని భావిస్తున్నారు.