ఓటర్ల జాబితాపై పార్లమెంట్ లో గందరగోళం
ఓటర్ల జాబితాలో అక్రమాలపై పార్లమెంటులో గందరగోళం నెలకొంది. పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై చర్చించాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టారు. క్వశ్చన్ అవర్ లో లేవనెత్తిన ఈ అంశంపై విపక్షాల సభ్యులు చర్చకు పట్టుబట్టారు. సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశాయి.