Home Page SliderTelangana

రాష్ట్ర ప్రభుత్వం 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలనపై సదస్సులు

తెలంగాణ: ప్రజావాణి ద్వారా దరఖాస్తులు పరిశీలిస్తున్న ప్రభుత్వం.. వాటిలో చాలా సమస్యలు గ్రామస్థాయివేనని గుర్తించింది. దీంతో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు జిల్లా కలెక్టర్లు గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తారు. విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. తొలుత 10 రోజులు, తర్వాత వారానికి రెండు రోజులు లేదా నెలలో కొన్నిరోజులు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.