Home Page SliderTelangana

డీఎస్‌కు ప్రముఖ రాజకీయ నాయకుల సంతాపం

అనారోగ్య సమస్యలతో ఈరోజు ఉదయం మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌కు పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించి.. డీఎస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఎంతో గొప్ప సేవలు అందించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.