“ఏపీలో ఉచిత పథకాలు పొందాలంటే షరతులు పాటించాల్సిందే”:అమర్‌నాథ్
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి,వైసీపీ నేత అమర్‌నాథ్ విమర్శలు గుప్పించారు. కాగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలోనే రాష్ట్రంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్,BPCLకు అడుగులు పడ్డాయన్నారు.కాగా టీడీపీ హయాంలో ఇసుక ఫ్రీ అంటున్నారు. కానీ సీనరేజీ,రవాణా ఛార్జీలు చెల్లించాలంటున్నారు. మరోవైపు నాణ్యమైన కరెంట్ కోసం ఛార్జీలు పెంచాలంటున్నారు. ఇప్పుడున్న కరెంట్ నాణ్యమైనది కాదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తల్లికి వందనం కుటుంబంలో ఒకరికి మాత్రమే అని చెబుతున్నారన్నారు.మరి ఇద్దరు పిల్లలకు రావాలంటే మరొకర్ని పెళ్లి చేసుకోవాలంటారేమో అని అమర్‌నాథ్ సెటైర్లు వేశారు.