శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన
ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయనకు ఇంటర్నల్ ఇంజ్యూరీ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అతని ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉన్న ప్లీహమ్ (Spleen) అవయవానికి తీవ్రమైన గాయమైందని సమాచారం. ఈ గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ (Spleen Rupture) చోటుచేసుకుందని వైద్య బృందం వెల్లడించింది.
దీంతో శరీరంలోని రక్తకణాల శుద్ధి, బ్లడ్ సెల్స్ స్టోరేజీ, పాత రక్తకణాల తొలగింపు వంటి ప్రక్రియల్లో అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు శ్రేయస్ అయ్యర్‌ను ప్రస్తుతం ICUలో ఉంచి ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

