Andhra PradeshHome Page Slider

ఏపీలో 8వ రోజు కొనసాగుతున్న అంగన్‍‌వాడీల ఆందోళనలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీల ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.అయితే నేటితో ఈ నిరసనలు 8వ రోజుకు చేరుకున్నాయి. కాగా తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు నెల్లూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం సహా పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు.ఈ మేరకు వారు తిరుపతిలో భిక్షాటన,తూర్పు గోదావరి జిల్లాలో వంటావార్పు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. అయితే వారు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే  పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఏపీలో అంగన్‌వాడీల వేతనాల పెంపు, గ్రాట్యూటీ,పెన్షన్ అమలు చేయాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు.ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్ వాడీలు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.