రోడ్డు పక్కన సమగ్ర సర్వే ఫారాలు..
సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి సమీపంలో ఉన్న పక్కన రేకుల బావి చౌరస్తా వద్ద దారిపొడవునా నిన్న సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు కనిపించాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి సిబ్బందితో వెళ్లి ఫారాలను సేకరించి, కార్యాలయానికి తీసుకెళ్లారు. సర్వే ఫారాలు రోడ్డుపై కన్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కమిషనర్ ను వివరణ కోరగా తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి దరఖాస్తులను సేకరించామన్నారు.

