GHMC కి కుక్కలదాడులపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
గడచిన 2 రోజుల్లో వీధి కుక్కల దాడిపై సుమారు 15 వేల ఫిర్యాదులు అందాయని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ తెలిపింది. అంబర్‌పేటలోని బాలుడిపై వీధికుక్కలు దాడిచేసిన ఘటన నగర వ్యాప్తంగా సంచలనం రేపింది. బాలుడు మరణించడంతో హైకోర్టు కూడా జీహెచ్‌ఎంసీ పై సీరియస్ అయ్యింది. గంటకు సుమారు 416 ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజూ 10 ఫిర్యాదులపై స్పందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 150 ఆపరేషన్లు GHMC చేస్తోందని… నగరంలో ఐదు ప్రాంతాల్లో షెల్టర్ హోమ్స్ ఉన్నాయన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక ఆపరేషన్ టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

