అసెంబ్లీ ఫుడ్ పై ఎమ్మెల్యేల ఫిర్యాదు.. కాంట్రాక్టర్ మార్పు
అసెంబ్లీకి ఫుడ్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ను ఇవాళ మార్చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో భోజనంపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు, ఇతరులకు వేరువేరుగా భోజనం పెట్టారా అని నిలదీశారు. అందరికీ ఒకేలా భోజనం పెట్టామని అధికారులు సమాధానమిచ్చారు. ఒకేలా భోజనం పెడితే తనకు ఫిర్యాదులు ఎందుకొచ్చాయో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా అంటూ అధికారులు, కాంట్రాక్టర్ పై స్పీకర్ ఫైర్ అయ్యారు. దీంతో ఫుడ్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ను మార్చివేశారు. ఇవాల్టి నుంచే కొత్త ఫుడ్ కాంట్రాక్టర్ కు భోజనం సరఫరా చేసే బాధ్యతను అప్పగించారు. ఇవాళ అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యేలకు శిక్షణ అనంతరం మధ్యాహ్నం కొత్త కాంట్రాక్టర్ భోజనం ఏర్పాటు చేశారు.

